Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గరిడేపల్లి
ఉదయం పాఠశాలకు వెళ్లిన కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థిని కండ్లు తిరిగి పడిపోగా.. ఆస్పత్రికి తీసుకెళ్తుండగానే మృతిచెందింది. ఈ ఘటన సోమవారం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల కేంద్రంలో జరిగింది. పాఠశాల సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం..సోమ్లాతండాకు చెందిన గుగులోతు చంద్రు- లలితల కూతురు దివ్య(14) గరిడేపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఎనిమిదో తరగతి చదువుతుంది. ఉదయం అల్పాహారం తిని పాఠశాలకు వెళ్లింది. కొద్దిసేపటి తర్వాత కండ్లు తిరిగి పడింది. వెంటనే స్థానిక పీహెచ్సీ ఏఎన్ఎంకు ఫోన్ చేశారు. పాఠశాల సిబ్బంది బాలికను మోటార్ సైకిల్‌పైనే ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ బాలిక కూర్చోలేని స్థితిలో ఉండటంతో అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. హుజూర్‌నగర్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందింది. ఎంఈఓ శత్రునాయక్, డీఈఓ కె.అశోక్, పెండెం సుజాత శ్రీనివాస్‌గౌడ్, ఎంపీడీఓ వనజ, తహసీల్దార్ కార్తీక్, ఎంపీఓ లావణ్య పాఠశాలను సందర్శించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు.