Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీస్ స్టేషన్లో రేవంత్రెడ్డి ఫిర్యాదు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ మహిళలను అవమానించారని టీపీసీసీ నేత రవేంత్రెడ్డి అన్నారు. అందువల్ల ఆయనపై కేసు నమోదు చేయాలంటూ జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల అధికారులు ఆయన మీద క్రిమినల్ కేసులు పెడతారని ఆశించామనీ, అయితే ప్రధాని నిస్సిగ్గుగా బిశ్వ శర్మను సమర్థిస్తున్నారని మండిపడ్డారు. అసోం సీఎంపై చర్యలు తీసుకోవడంలో అక్కడి అసోం పోలీస్, ఎన్నికల వ్యవస్థలు విఫలం అయ్యాయన్నారు. బిశ్వ శర్మ వ్యాఖ్యలతో దేశంలోని మాతృమూర్తులకు అవమానం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తాము ఇక్కడ కేసులు పెడుతున్నామని తెలిపారు. వెంటనే ఆయనపై క్రిమినల్ కేసులు పెట్టి నోటీస్లు పంపాలని డిమాండ్ చేశారు. బిశ్వ శర్మను అరెస్ట్ చేసి తీసుకురావాలన్నారు. కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఓ స్పెషల్ టీంను ఏర్పాటు చేయాలని తెలిపారు. న్యాయ నిపుణుల సలహా తీసుకుని అసోం సీఎంను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. చర్యలు తీసుకోకపోతే 16న పోలీస్ కమిషనర్, ఎస్పీ కార్యాలయాల ముందు నిరసన తెలుపుతామని రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు ఆయా పోలిస్ స్టేషన్ లలో అసోం సీఎం హిమంత బిశ్వ శర్మపై ఫిర్యాదు చేశారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల నిరసనలు నిర్వహించారు.ర్యాలీలు తీసి పోలీసుస్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయా మండలాల్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేలకొండపల్లిలో పొట్టి శ్రీరాములు కుడలి నుంచి పోలీస్ స్టేషన్కు వరకు ర్యాలీ నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.