Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సత్యవతి రాథోడ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గిరిజనుల ఆరాధ్యుడు సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ 283వ జయంతి ఉత్సవాలను మంగళవారం అధికారికంగా జరుపనున్నట్టు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా గిరిజనులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. గిరిజనులను అన్ని పార్టీలు, ప్రభుత్వాలు ఓటు బ్యాంకుగా చూస్తే..రాష్ట్ర ప్రభుత్వం వారి సమస్యలు పరిష్కరించి, ఆత్మగౌరవాన్ని కాపాడుతున్నదని పేర్కొన్నారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్లో బంజారా భవన్ నిర్మాణం పూర్తయిందని తెలిపారు. రాష్ట్రంలో 31 బంజారా భవన్లు నిర్మిస్తామని పేర్కొన్నారు.