Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రవెంకటేశం
- టీఎస్ యూటీఎఫ్ హర్షం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మహాత్మా జ్యోతీరావు ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ సిబ్బందికి నూతన వేతనాల(పీఆర్సీ) అమలుకు అనుమతినిస్తూ బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బి వెంకటేశం సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం పట్ల టీఎస్యుటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.జంగయ్య, చావ రవి హర్షం వ్యక్తం చేశారు. నూతన వేతనాలు బకాయిలతో సహా వెంటనే చెల్లించేలా సొసైటీ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. గిరిజన సంక్షేమ శాఖ కూడా జీఓ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.