Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 23, 24 తేదీల్లో కలెక్టరేట్ల ముందు ధర్నా:ఆవాజ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమానికి బడ్జెట్లో కేటాయింపులు పెంచాలనీ, సుధీర్ కమీషన్ సిఫార్సుల ప్రకారం సబ్ ప్లాన్ చట్టం చేయాలని ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ డిమాండ్ చేశారు.హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం ఆవాజ్ రాష్ట్ర కమిటి సమావేశం ఉపాధ్యక్షులు ఎండీ జబ్బార్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా అబ్బాస్ మాట్లాడుతూ ఈ నెల 23,24 తేదీల్లో జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపు నిచ్చారు. సీఎం కేసీఆర్ చేసిన వాగ్దానాలు విస్మరించారనీ, ఏడేండ్లుగా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ లోన్లు ఇవ్వడం లేదని తెలిపారు. ప్రతి ఏడాది బడ్జెట్లో కేటాయింపులు పెంచటానికి బదులు తగ్గిస్తున్నారని చెప్పారు. కేటాయించిన బడ్జెట్ను విడుదల చేయటం లేదన్నారు. కోవిడ్-19 వల్ల ఆర్థికంగా చితికిపోయిన స్ట్రీట్ వెండర్స్, హాకర్స్, ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మార్చి ఒకటి నుంచి10 వరకు మైనారిటీ బస్తీల్లో సర్వేలు నిర్వహించాలని ఆవాజ్ రాష్ట్ర కమిటీ తీర్మానించిందన్నారు. సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర కోశాధికారి షేక్ అబ్దుల్ సత్తార్, ఉపాధ్యక్షులు అజీజ్ అహమ్మద్ ఖాన్, మహమ్మద్ అలీ, అబ్దుల్ నబీ, సర్దార్, షేక్ ఇమామ్ పాషా,రహీంఖాన్,గయాసుద్దీన్, ఇఫ్తేకార్, రఫత్ అంజుమ్, అమ్జద్ పాషా, ఇమామ్ పాషా, అజ్మత్, తదితరులు పాల్గొన్నారు.