Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఏఐసీసీ మాజీ అధ్యక్షులు దామోదరం సంజీవయ్య ఆదర్శ జీవితాన్ని గడిపారని పలువురు వక్తలు కొనియాడారు. దామోదరం సంజీవయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం ఇందిరాభవన్లో ఆయన శత జయంతి ఉత్సవాలను నిర్వహించాయి. ట్రస్ట్ చైర్మెన్, మాజీ పీసీసీ అధ్యక్షులు వి. హనుమంతరావు, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, ప్రముఖ సంపాదకులు కె.శ్రీనివాస్, రామచంద్రమూర్తి, గద్దర్, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మెన్ మహేశ్వర్ రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ నాయకులు కోదండ రెడ్డి, వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దామోదరం సంజీవయ్య విశిష్ట వ్యక్తిత్వం ఉన్న గొప్ప నాయకుడని తెలిపారు. తన సమర్థతతో దేశ రాజకీయాల్లో కీలకంగా మారారని తెలిపారు. ప్రాంతీయ పార్టీల్లో ఆయా కుటుంబాలకు చెందిన వారే సీఎంలు అవుతుంటారనీ, అదే జాతీయ పార్టీల్లో దళితులకు ముఖ్యమంత్రులయ్యే అవకాశముంటుందని తెలిపారు. గద్దర్ మాట్లాడుతూ కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని కోరుదామని సూచించారు.
తెలంగాణ ఒక నాయకుడి ఉద్యమం కాదు :మానిక్కం ఠాగూర్
తెలంగాణ ఒక నాయకుడి ఉద్యమం కాదనీ, అది ప్రజా ఉద్యమమని ఏఐసీసీ ఇంఛార్జీ మానిక్కం ఠాగూర్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఎమ్మెల్సీ కవితను ఉద్దేశిస్తూ సోమవారం ట్వీట్ చేశారు. సోనియాగాందీ సంకల్పం వల్లనే తెలంగాణ కల సాకరమైందని, ఈ విషయాన్ని పేర్కొన్నారు. ఈ విషయాన్ని మర్చిపోవద్దని కోరారు.