Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నగరంలో నిరుద్యోగం, మాదక ద్రవ్యాలే ప్రధాన సమస్యలు: సిటీలో పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్
నవతెలంగాణ ముషీరాబాద్
ప్రస్తుతం సమాజంలో నిరుద్యోగం, మాదక ద్రవ్యాల వినియోగం ప్రధాన సమస్యగా మారాయని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. రాష్ట్రంలో అటువంటి సమస్యలు ఉండకూడదని సీఎం కేసీఆర్ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. డ్రగ్స్‌ను పూర్తిస్థాయిలో నిర్మూలించేందుకు వెయ్యిమందితో కూడిన ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని సీఎం సూచించారన్నారు. మత్తురహిత నగరమే లక్ష్యం సోమవారం ఆర్టీసీ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన 'మాదక ద్రవ్య రహిత హైదరాబాద్' ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 'ఫియర్ ప్రెషర్'కు లోబడి విద్యార్థులు మారక ద్రవ్యాలకు బానిస కావద్దని చెప్పారు. ఒక్కసారి అవి అలవాటైతే వ్యసనంగా మారుతుందని, జీవితాలు నాశనం అవుతాయని హెచ్చరించారు. మాదక ద్రవ్యాల రవాణాను, క్రయ విక్రయాలను కట్టడి చేయడమేకాకుండా నేరస్థులకు తగిన శిక్ష పడే విధంగా సమర్థవంతంగా పని చేస్తామని చెప్పారు. హైదరాబాద్‌ను పూర్తిగా డ్రగ్స్ ఫ్రీ సిటీగా మారుస్తామన్నారు.
కొవిడ్ కారణంగా రెండేండ్ల తర్వాత విద్యార్థులతో ప్రత్యక్షంగా అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. పంజాబ్ వంటి రాష్ట్రాలో పోలీస్, ఎక్సైజ్, ఇతర విభాగాలు త్వరగా మేల్కోకపోవడం వల్ల ఆ ప్రాంతాల్లో మాదక ద్రవ్యాల విచ్ఛల విడి వాడకాన్ని కట్టడి చేయలేకపోయారని తెలిపారు. కానీ, రాష్ట్రంలో, హైదరాబాద్ నగర పోలీసులు మాదక ద్రవ్యాలను కట్టడి చేయడానికి అన్ని రకాల చర్యలూ తీసుకుంటున్నారని చెప్పారు. నగరంలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ వినియోగం వల్ల తలెత్తే అనర్థాల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అనంతరం సెంట్రల్ జోన్ డీసీపీ రాజేష్ చంద్ర చిక్కడపల్లి ఏసీపీ సిహెచ్ శ్రీధర్‌తో కలిసి అవగాహన కార్యక్రమాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడుతామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్లు సంజరు కుమార్, జహంగీర్ యాదవ్, అరోరా డిగ్రీ విద్యాసంస్థల కార్యదర్శి డాక్టర్ రమేష్ అరోరా, మోటివేషనల్ స్పీకర్ ఆకెళ్ల రాఘవేంద్ర, డాక్టర్ జయరాంరెడ్డి, అరోరా కాలేజ్ ప్రిన్సిపల్ విశ్వనాథం బలుసు తదితరులు పాల్గొన్నారు.