Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతులను కేసీఆర్ రెచ్చగొడుతున్నారు
- జవాన్లను కించపరిచిన కేసీఆర్ దేశద్రోహే : బండి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్ సవరణ బిల్లులో వ్యవసాయ బావులకు విద్యుత్ మీటర్లు పెట్టాలని ఎక్కడా లేదనీ, తన ఛరిష్మా తగ్గుతుండటంతో రాష్ట్రంలో మరోమారు సెంటిమెంట్‌ను రగిలించేందుకు రైతులను కేసీఆర్ రెచ్చగొడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరుకుమార్ విమర్శించారు. సోమవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అసలు సర్జికల్ స్ట్రైక్ జరగలేదనటం పుల్వామా ఘటనలో జవాన్ల త్యాగాలను కించపరచటమేననీ, అలా మాట్లాడిన కేసీఆర్ దేశద్రోహి అని అన్నారు. సైనికుల ఆత్మసైర్థ్యం దెబ్బతినేలా మాట్లాడిన కేసీఆర్ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. టెన్ జన్‌పథ్ స్క్రిప్ట్‌ను సీఎం ఫాలో అవుతున్నారని విమర్శించారు. రాబోయే రోజుల్లో ప్రగతి భవన్ నుంచి గాంధీభవన్‌కు మారబోతున్నారనీ, కాబోయే పీసీసీ అధ్యక్షుడు కేసీఆర్నేనని ఎద్దేవా చేశారు. మోడీ వచ్చాకే రాష్ట్రాలకు ఇచ్చే నిధుల్ని 32 నుంచి 42 శాతం పెంచారని కేసీఆర్ గతంలో అనలేదా? అని ప్రశ్నించారు. రాపెల్పై సుప్రీంకోర్టే క్లీన్చిట్ ఇచ్చిందనీ, ఆ తీర్పును ప్రశ్నించటమేంటని నిలదీశారు. ఎనిమిదేండ్లుగా డిస్కమ్‌లకు రూ.48 వేల కోట్ల రూపాయల నష్టాల పాలుచేశావనీ, అవి పూర్తిగా మూతపడి రాష్ట్రమంతా కరెంట్ లేక చీకటైపోయే ప్రమాదం పొంచి ఉందని చెప్పారు. పాతబస్తీలో 80 శాతం దాకా కరెంటు బిల్లులు వసూలు కావట్లేదనీ, కేసీఆర్ ప్రభుత్వం ఏం చేస్తున్నదని ప్రశ్నించారు. రాజ్యాంగంపై సీఎం వ్యాఖ్యలు సరిగాదన్నారు. ఉన్నన్ని రోజులు తాను, తన కుటుంబ సభ్యులే తెలంగాణకు శాశ్వత సీఎమ్‌లుగా ఉండాలని రాయాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. దేశంలోకి వచ్చే విదేశీ పెట్టుబడుల్లో 50 శాతం కర్నాటకకే వచ్చాయనీ, అందులో తెలంగాణ ఏడో స్థానంలో ఉందని చెప్పారు. అవినీతి కూపంలోకి కూరుకుపోయిన కేసీఆర్ జైలుకు పోవడం గ్యారెంటీ అన్నారు.