Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్ఆర్టీసీ ఎమ్డీ వీసీ సజ్జనార్
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ఇంటికి వచ్చిన అతిథులను ఎలా చూస్తామో, మేడారం జాతరకు వచ్చే ప్రయాణీకుల పట్ల కూడా అలాగే వ్యవహరించాలని టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ అన్నారు. వారికి ఎలాంటి లోటు రాకుండా చూడాల్సిన భాద్యతను మరవకూడదని చెప్పారు. సోమవారంనాడాయన హైదరాబాద్ నుంచి గరుడ ప్లస్ బస్లో అధికారులతో కలిసి వరంగల్ చేరుకుని అక్కడ స్టాఫ్ ట్రైనింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో మేడారం రవాణా ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. సిబ్బంది సమన్వయంతో ప్రణాళిక బద్ధంగా పని చేయాలని చెప్పారు. మేడారం విత్ టీఎస్ఆర్టీసీ యాప్తీసుకురావడం సంస్థకు గొప్ప మైలు రాయిగా నిలుస్తుంన్నారు. ఆర్టీసీకి భవిష్యత్లో మంచిరోజులు వస్తాయన్నారు. జాతర సేవల్ని ఆదాయమార్గంగా చూడటం లేదనీ, ప్రజా రవాణా సేవగా భావిస్తున్నామన్నారు. అనంతరం టెలిఫోన్ డైరెక్టరీతో పాటు క్యాప్, ఇతర సామాగ్రితో కూడిన కిట్లను అధికారులకు అందజేశారు. మేడారం జాతరలో టీఎస్ఆర్టీసీ కార్యకలాపాలపై వరంగల్ 1 డిపో కండక్టర్ శ్రీమతి కే శివలీల గానం చేసిన సీడీని ఆవిష్కరించి ఆమెను అభినందించారు. మెయింటనెన్స్ మేనేజ్మెంట్ పుస్తకాన్ని విడుదల చేశారు . కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సీ వినోద్, ఈ యాదగిరి, పీవీ మునిశేఖర్, వరంగల్ రీజినల్ మేనేజర్ డి విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.