Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిరుపేద విద్యార్థినులకు ఆర్థిక సహాయం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
మంత్రి కే తారకరామారావు మరోసారి దాతృత్వాన్ని చాటారు. పేదరికంతో ఉన్నత విద్యను అందుకోలేకపోతున్న ఇద్దరు విద్యార్థినులకు ఆర్థిక సహాయాన్ని అందచేశారు. పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండలం రాజాపూర్ గ్రామానికి చెందిన ఆవునూరి అఖిల తండ్రి ప్రభాకర్ రైతు, తల్లి గహిణి. అఖిల ఇంటర్మీడియట్లో 98 శాతం మార్కులతో ఉత్తీర్ణురాలై ఎంబీబీఎస్‌లో సీటు సాధించింది. మల్లారెడ్డి మెడికల్ కాలేజీలో సీటు వచ్చింది. ఫీజులు చెల్లించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం మంత్రి కేటీఆర్ దష్టికి రాగా, ఆమె విద్యాభ్యాసానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తానని గతంలో హామీ ఇచ్చారు. ఈ మేరకు సోమవారం ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌ను అఖిల కుటుంబం కలిసింది. వారి యోగక్షేమాలు, ఆర్థిక స్థితిగతులను అడిగి తెలుసుకున్న మంత్రి అఖిలకు ఆర్థిక సహాయాన్ని అందచేశారు. అలాగే భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన స్పందన 95 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ పూర్తిచేసుకుని టిఆర్ఆర్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ కోర్స్ లో సీటు సాధించింది. స్పందన తల్లిదండ్రులు రోజువారి కూలి పనులు చేసుకుంటూ ఆమెను ఇప్పటిదాకా చదివించారు. ఆ కుటుంబం కూడా ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌ను కలిసింది.వారికీ ఆయన ఆర్థిక సహాయాన్ని అందించారు.