Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జహీరాబాద్లో దారుణం
నవ తెలంగాణ-జహీరాబాద్
మైనర్పై లైంగిక దాడికి పాల్పడి ఆపై దారుణంగా హత్య చేసిన సంఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం హూగ్గేలీ గ్రామంలో సోమవారం మధ్యాహ్నం వెలుగులోకి వచ్చింది. జహీరాబాద్ సీఐ రాజశేఖర్, మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మైనర్ (16) ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో తన తల్లితో కలిసి గ్రామంలో చిట్టి డబ్బులు కట్టేందుకు వెళ్లొచ్చి ఇంట్లో పడుకుంది. సోమవారం ఉదయం తల్లి బుజ్జమ్మ లేచి చూసేసరికి కూతురు లేకపోవడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే మధ్యాహ్నం గ్రామ శివారులోని మామిడి తోటలో మైనర్ మృతదేహాన్ని చూసిన గ్రామస్తులు కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారమందించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మైనర్ మెడకు చున్నీతో ఉరి బిగించి హత్య చేసినట్టు ప్రాథమిక నిర్థారణకు పోలీసులు వచ్చారు. సంఘటనా స్థలాన్ని జహీరాబాద్ డీఎస్పీ శంకర్ రాజు పరిశీలించారు. జిల్లా కేంద్రం నుంచి జాగిలాలను రప్పించి వివిధ రూపాల్లో విచారణ జరిపి నిందితులను త్వరలోనే పట్టుకుంటామని డీఎస్పీ తెలిపారు.