Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రొఫెసర్ కోదండరాం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గుర్రంపోడు గిరిజనులకు న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని తెలంగాణ జన సమితి ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. మంగళవారం నాంపల్లిలోని టీజేఎస్ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సూర్యపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రం పోడు, తుమ్మల తండా, భోజ్య, కృష్ణా తండాల్లో పోడు భూముల కబ్జా జరిగిందని చెప్పారు. పేదల మీద ప్రేమ ఉంటే గుర్రంపోడు భూములను రక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అసైన్డ్ భూమి కొనుగోలు, అమ్మకాలు జరగవని కోర్టు తీర్పు ఉన్నా...భూ అక్రమణదారులకు ఎమ్మెల్యే, ప్రభుత్వం అండగా ఉందని విమర్శించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే భూ ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలనీ, భూ ఆక్రమణదారులకు అండగా ఉన్న ఎమ్మెల్యేపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.