Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ చీఫ్ రేవంత్ పిలుపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాహుల్ గాంధీపై అస్సాం సీఎం హేమంత్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై అన్ని పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ ఆయనపై కేసు నమోదు చేయనందుకు నిరసనగా బుధవారం అన్ని పోలీస్ కమిషనరేట్ల వద్ద ధర్నాలు నిర్వహించాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. అంతకు ముందుకు ఆయన ఎంపీ కోమటిరెడ్డి నివాసానికి వెళ్లారు. పార్టీ అంతర్గత సమస్యలపై చర్చించారు. ఇటీవల జనగామ సభలో సీఎం కేసీఆర్‌పై కోమటిరెడ్డి పొగడ్తల వర్షం కురిపించారు. దీంతో ఆయన టీఆర్ఎస్ గూటికి వెళతారనే ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయనను రేవంత్ బుజ్జగించినట్టు తెలిసింది. కలిసిమెలిసి పని చేయడం ద్వారా కాంగ్రెస్‌ను అధికారానికి తీసుకరావాలని సూచించినట్టు సమాచారం. అనంతరం రేవంత్, కోమటిరెడ్డి విలేకర్లతో మాట్లాడారు. అందరూ పదవుల కోసం పాకులాడితే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన పదవి త్యాగం చేశారని రేవంత్ గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఆయనది కొండ లక్ష్మణ్‌బాపూజీ లాంటి త్యాగమన్నారు. పార్టీలో అంతర్గత విషయాలపై చర్చించామనీ, వాటిని పార్టీలో పెట్టి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ దేశ సమైక్యత కోసం త్యాగాలు చేసిన గాంధీ కుటుంబం గురించి అస్సాం బీజేపీ ముఖ్యమంత్రి అవమానకరంగా మాట్లాడారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్స్టేషన్లలో ఆయనపై ముఖ్యమంత్రిపై ఫిర్యాదు చేశామన్నారు. ఏ ఒక్క పోలీసుస్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని విమర్శించారు. ాంగ్రెస్ భాగస్వామ్య పక్షాలతో సీఎం కేసీఆర్ భేటీ కావడమంటే, ఆయన ప్రధాని మోడీ కోవర్టుగా పనిచేస్తున్నారా? అనే అనుమానం కలుగుతున్నదని చెప్పారు. ఫ్రంట్ పేరుతో టెంట్ వేసి, కాంగ్రెస్‌ను బలహీన పరిచే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. నరేంద్ర మోడీని బలహీన పరచడం కంటే... బీజేపీ భాగస్వామ్య పక్షాలను బలహీన పరచాలని సూచించారు. కాంగ్రెస్ క్యాడర్లో సీఎం కేసీఆర్ గందరగోళం సష్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్‌ను దగ్గరకు రానిచ్చేదిలేదన్నారు. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులొచ్చి కాంగ్రెస్ నాయకుల ఇండ్ల ముందు నిలబడి పార్టీ నేతల బూట్లు నాకినా కూడా టీఆర్ఎస్తో కలిసి పని చేయబోమని స్పష్టం చేశారు. కోమటిరెడ్డి మాట్లాడుతూ అప్పుడు యువత తెలంగాణ ఉద్యమం కోసం, ఇప్పుడు ఉద్యోగాలకోసం చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ పుట్టిన రోజులోపు ఉద్యోగుల నోటిఫికేషన్లు వేయాలని డిమాండ్ చేశారు. వరి ధాన్యం కొనుగోళ్లలో భారీగా అవినీతి జరిగిందని తెలిపారు.
గాడిదలపై చిత్రపటాలతో ప్రదర్శన
రాహుల్‌గాంధీపై అస్సాం సీఎం హేమంత్ బిశ్వశర్మ చేసిన వ్యాఖ్యలకు నిరసన మహిళా కాంగ్రెస్ వినూత్న కార్యక్రమం చేపట్టింది. మంగళవారం హైదరాబాద్‌లోని నాంపల్లి చౌరస్తాలో గాడిదలపై హేమంత్, అమిత్‌షా, మోడీ చిత్ర పటాలను ఊరేగించారు. ఈ సందర్భంగా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు మాట్లాడుతూ అస్సాం సీఎంను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఇంచార్జి కోఆర్డినేటర్ నీలం పద్మ. ఉపాధ్యక్షులు వరలక్ష్మి. నాయకులు కవిత, అనురాధ, సౌజన్య తదితరులు పాల్గొన్నారు.