Authorization
Tue April 01, 2025 12:57:05 pm
- జోస్ కుట్టీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో 300 కంపెనీలు రూ.60 వేల కోట్ల లాభాన్ని గడించాయనీ, అవి సామాజిక బాధ్యతగా రూ.1200 కోట్లను ఖర్చు పెట్టనున్నాయని కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ తెలంగాణ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ వి.ఇ.జోస్ కుట్టీ తెలిపారు. మంగళవారం ది ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీ ఆధ్వర్యంలో కార్పొరేట్ సామాజిక బాధ్యత అనే అంశంపై జరిగిన వెబినార్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపు 1000 కంపెనీలకు రూ.67 వేల కోట్లు లాభం వచ్చిందన్నారు. కార్పొరేట్ చట్టాల సవరణ కోసం ఎఫ్టీసీసీఐ చూపించిన పనితీరును ఆయన ప్రశంసించారు.