Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎ.శాంతికుమారి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని 1.77 లక్షల ఎకరాల్లోని 179 అర్బన్‌ఫారెస్ట్ పార్కుల(హరితవనాలు) ద్వారా చిక్కటి పచ్చదనంతో అందమైన ప్రకృతి వెల్లివిరియాలని అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి ఆకాంక్షించారు. మంగళవారం హైదరాబాద్‌లోని అరణ్యభవన్‌లో ''తెలంగాణకు హరితహారం'' ద్వారా అటవీ శాఖ అభివృద్ధి చేస్తున్న హరితవనాల పురోగతిపై అటవీ, మున్సిపల్, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, ఫారెస్ట్ కార్పొరేషన్ ఉన్నతాధికారులతో ఆమె సమీక్షించారు. హరితవనాల్లో రెండు కోట్ల మొక్కలకుగానూ ఇప్పటిదాకా 60 లక్షల మొక్కలను నాటడం పూర్తయిందన్నారు. మిగతా కోటీ 40 లక్షల మొక్కలను నవంబర్ కల్లా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని హరిత వనాల్లోని ఖాళీ ప్రదేశాల్లో టాల్ ప్లాంట్స్ నాటడం ద్వారా చిక్కదనంతో కూడిన పచ్చదనం పెరిగేలా, జీవ వైవిధ్యం పెరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే అభివృద్ధి చేసిన పలు అటవీ పార్కులపై ప్రశంసలు వస్తున్నాయని చెప్పారు.