Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎస్‌కు ట్రెసా బృందం వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రెవెన్యూ శాఖ బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ట్రెసా రాష్ట్ర అధ్యక్షులు వంగ రవీందర్‌రెడ్డి కోరారు. మంగళవారం హైదరాబాద్‌లో బీఆర్కే భవన్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ట్రెసా బృందం కలిసింది. రెవెన్యూ శాఖలోని అన్ని క్యాడర్లకు పదోన్నతులు ఇవ్వాలని సీఎస్‌ను బృంద సభ్యులు కోరారు. జోన్, మల్టీజోన్ నుంచి మరో జోన్ మల్టీజోన్కు బదిలీ అయిన ఉద్యోగులకు, ప్రొబేషనరీ నాయబ్ తహసీల్దార్లకు పెట్టుకున్న ఆప్షన్ల ప్రకారం జీవో 21 గైడ్‌లైన్స్‌లోని 5, 8, 9లోని నిబంధనలను సవరించి పరస్పర బదిలీలకు అవకాశం కల్పించాలని విన్నవించారు. వీఆర్వోలను రెవెన్యూ శాఖలోనే సర్దుబాటు చేయాలనీ, కారుణ్య నియామకాలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏలకు పేస్కేలు వర్తింపజేయాలనీ, ఆర్డీఓ వ్యవస్థను బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు. పదోన్నతులు, వీఆర్ఏలకు స్కేల్ కల్పించే విషయంలో సీఎం సానుకూలంగా ఉన్నారనీ, పరస్పర బదిలీలు, స్పౌజ్ కేసులు కూడా చేపడతున్నామని సీఎస్ సోమేశ్‌కుమార్ ట్రెసా బృందానికి తెలిపారు. ఒకే జోన్ పరిధిలోని బదిలీలపైనా నిర్ణయం తీసుకుంటామనీ, వీర్వోవోలను త్వరలోనే సర్దుబాటు చేస్తామని హామీనిచ్చారు. సీఎస్కలిసిన వారిలో ట్రెసా అసోసియేట్ అధ్యక్షులు మన్నె ప్రభాకర్, ఉపాధ్యక్షులు కె. నిరంజన్ రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ నజీమ్ ఖాన్,సైదులు ,వీఆర్ఏల సంఘం అధ్యక్షులు రాజయ్య, వెంకటేశం యాదవ్ తదితరులు ఉన్నారు.