Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉత్తరప్రదేశ్ ఎన్నికల పరిశీలకునిగా కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ వెళ్లారు. ఈనెల పది నుంచి వచ్చేనెల 11వ తేదీ వరకు ఆయన ఎన్నికల విధుల్లో (ఆన్‌డ్యూటీ) ఉంటారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ మంగళవారం ఉత్తర్వులు విడుదల చేశారు. ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్‌కు కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్ఏసీ) అప్పగించామని తెలిపారు.