Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోఆపరేటివ్ సొసైటీస్ రిజిస్ట్రార్‌కు ఆర్టీసీ జేఏసీ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ ఆర్టీసీ థ్రిప్ట్ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీకి పాలకమండలి ఎన్నికలను వెంటనే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోఆపరేటివ్ సొసైటీస్ రిజిస్ట్రార్‌ను ఆర్టీసీ జేఏసీ నేతలు కోరారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లో రిజిస్ట్రార్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. 07 నవంబర్ 2016న ఎన్నికలు జరిగాయనీ, పాలకమండలి కాలపరిమితి 2021లోనే ముగిసిందని రిజిస్ట్రార్ దృష్టికి ఆర్టీసీ జేఏసీ చైర్మెన్ కె.రాజిరెడ్డి తీసుకెళ్లారు. గడువు అయిపోయి మూడు నెలలు గడుస్తున్నా ఎన్నికల ప్రక్రియ జరగలేదని తెలిపారు. కోఆపరేటివ్ చట్టంలోని సెక్షన్ 23లోని ఐటమ్ 3 ప్రకారం పాతపాలకమండలి గడువు ముగియకముందే ప్రతినిధుల ఎన్నిక జరిపి, కొత్త పాలకమండలిన ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. చట్టంలోని సెక్షన్ 23-ఏ ప్రకారం బోర్డు సస్పెన్షన్లోగానీ, తిరిగి భర్తీ చేయకుండా ఆరు నెలలకు మించరాదనే విషయం స్పష్టంగా ఉందని ప్రస్తావించారు. రిజిస్ట్రార్ వెంటనే జోక్యం చేసుకుని తక్షణమే టీఎస్ఆర్టీసీ సీసీఎస్‌కు ఎన్నికలు జరిపేలా సీసీఎస్ కార్యదర్శికి, మేనేజింగ్ డైరెక్టర్‌కు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ వైస్ చైర్మెన్ కె.హన్మంతు ముదిరాజ్, కన్వీనర్ కమాల్‌రెడ్డి, కో-కన్వీనర్లు జి.అబ్రహం, కె.యాదయ్య, ఎస్.సురేశ్, బి.యాదగిరిలతో పాటు బి.జక్కరయ్య, జీఆర్‌రెడ్డి, కె.గీత, ప్రకాశ్, శామ్యూల్ బంగారం పాల్గొన్నారు.