Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్లోని మియాపూర్లో వామపక్ష నేత, ఎంసీపీఐ(యు) రాష్ట్ర కార్యదర్శి తాండ్ర కుమార్ భౌతికకాయానికి సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు. కుమార్ మరణానికి సీఐటీయూ రాష్ట్ర కమిటీ తరఫున సంతాపాన్ని, కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కుమార్ ప్రజా సమస్యలపై పోరాడుతూనే కార్మికవర్గం ఎదుర్కొంటున్న అనేక ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొనేవారని గుర్తుచేశారు. కార్మిక పోరాటాలు, సమ్మెలకు వామపక్ష నేతలతో కలిసి మద్దతు తెలిపేవారన్నారు. కుమార్ మరణం వామపక్ష ఉద్యమాలకు, కార్మిక పోరాటాలకు తీరని లోటని పేర్కొన్నారు. మంగళవారం మియాపూర్లో తాండ్రకుమార్ అంత్యక్రియలు జరిగాయి.