Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మృతుడు నల్లగొండ జిల్లా వాసి
నవతెలంగాణ-కాగజ్‌నగర్ రూరల్
కేబుల్ నెట్వర్క్ కోసం గుంతలు తవ్వుకుండ గా.. ప్రమాదశాత్తు మట్టిపెల్లలు మీదపడటంతో ఓ వ్యక్తి ప్రాణం కోల్పోయాడు. ఈ ఘటన కాగజ్‌నగర్ మండల పరిధిలో మంగళవారం జరిగింది. తోటి కూలీలు, ఎస్ఐ సందీప్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా చందుపట్లకు చెందిన జి.లింగయ్య, తండ్రి ఎల్లయ్యతో కలిసి కాగజ్‌నగర్ మండలం సార్సాల గ్రామానికి పని కోసం వచ్చారు. ఓ ప్రయివేటు కేబుల్ నెట్వర్క్ పనుల్లో భాగంగా గుంతలు తవ్వుతున్నారు. గుంతలో దిగి పని చేస్తుండగా పై నుంచి మట్టిపెల్లలు కూలడంతో లింగయ్య మట్టిలో కూరుకుపోయి ప్రాణం కోల్పోయాడు. అతని తండ్రి ఎల్లయ్య జేసీబీ సాయంతో మట్టిపెల్లలు తొలగించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. జేసీబీ సైతం బురదలో ఇరుక్కుపోవడంతో సహాయక చర్యలు సాగలేదు. లింగయ్యకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.