Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫిబ్రవరి 28 నుంచి మార్చి5 వరకు బ్రాంచ్ అదాలత్
- రుణగ్రహీతలు సద్వినియోగం చేసుకోండి :బ్యాంక్ అధికారులు
హైదరాబాద్ : బ్యాంక్ ఆఫ్ ఇండియా '' బ్రాంచ్ అదాలత్ '' కార్యక్రమాన్ని ఇండియా అంతటా నిర్వహించింది.కోవిడ్ మహమ్మారి వలన ప్రభావితమైన రుణ గ్రహీతలకు ఉపశమనం కల్పించడానికి జనవరి1,2022 నుంచి ఫిబ్రవరి 5, 2022 వరకు నిర్వహించినది. ప్రత్యేకంగా రుణ మొత్తం రూ. ఇరవై ఐదు లక్షలు వరకు కలిగిన చిన్న రుణ గ్రహీతలు, వ్యవసాయ రుణాలు, చిన్న మాద్యమిక రుణాలు , వ్యక్తిగత రుణాలకు వర్తిస్తుంది. దేశంలో మొత్తంగా 6,84,000 రుణ గ్రహీతలు.. ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. తమ రుణాలను బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ అదాలత్ ద్వారా పరిష్కారం పొందారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా 407.00 కోట్ల మేర రుణాలను ఈ పథకం ద్వారా పరిష్కరించింది .ముందు నిర్వహించిన బ్రాంచ్ అదాలత్ కు మంచి స్పందన లభించడంతో రుణ గ్రహీతలకు మరో ఒక సువర్ణ అవకాశాన్ని బ్యాంక్ ఆఫ్ ఇండియా కల్పించింది. ఫిబ్రవరి 28,22 నుంచి మార్చి ఐదు 2022 వరకు బ్రాంచ్ అదాలత్ కార్యక్రమాన్ని మరలా నిర్వహించనున్నది. కావున రుణ గ్రహీతలు ఈ సదవకాశాన్ని విని యోగించుకోవాలని బీఓఐ కోరింది.