Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జల వివాదంపై హైకోర్టు ఉత్తర్వులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాద పరిష్కార పరిధి తమకు లేదని హైకోర్టు ప్రకటించింది. జల విద్యుత్ కోసం కృష్ణా జలాలను వాడుకుని అనవసరంగా విడుదల చేస్తున్నారని ఏపీకి చెందిన గుడవ్లి శివరామకృష్ణ తదితరులు దాఖలు చేసిన రిట్లో ఉత్తర్వుల జారీకి నిరాకరించింది. రిట్‌పై విచారణను ముగించింది. ఆర్టికల్ 262 ప్రకారం అంతరాష్ట్ర జలవివాదాల పరిష్కారానికి ప్రత్యేక చట్టం ఉందని చెప్పింది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం హైకోర్టులు విచారణ చేయడానికి వీల్లేదని, ప్రత్యేక చట్టం ద్వారా సంక్రమించిన కోర్టులు లేదా సుప్రీంకోర్టు మాత్రమే రాష్ట్రాల మధ్య వివాదాల్ని పరిష్కరించాలని తెలిపింది. పిటిషనర్లు చట్ట ప్రకారం ప్రత్యామ్నాయాలను ఎంచుకోవచ్చునని స్పష్టం చేసింది. ఈ మేరకు చీఫ్‌జస్టిస్ సతీష్‌చంద్రశర్మ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఆదేశాలిచ్చి రిట్లపై విచారణను ముగించింది.
ఆ ఇద్దరు ఎంఎస్‌జె కోర్టులో లొంగిపోవాలి...
భారీ నిధుల కుంభకోణంలో నిందితులను రిమాండ్‌కు పంపకుండా హైదరాబాద్ ఎంఎస్‌జె కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. మనీల్యాండరింగ్ కేసులో సీఆర్పిఎస్ సెక్షన్ 41-ఎ కింద నోటీసు ఇవ్వక్కర్లేదని చెప్పింది. రెండు కేసుల్లోని నిందితులిద్దరు... పది రోజుల్లోగా ఎంఎస్‌జె కోర్టులో లొంగిపోవాలని హైకోర్టు మంగళవారం ఆదేశించింది. బ్యాంకు నుంచి రుణం తీసుకుని వాటిని మళ్లించారనే కేసులో రాంచీ ఎక్స్‌ప్రెస్ హైవేస్ లిమిటెడ్ డైరెక్టర్ కె. శ్రీనివాస్, ఐఎంఎస్ స్కాంలో ఓమ్ని మెడి కంపెనీ ఎండీ కె. శ్రీహరిబాబులకు కింది కోర్టు రిమాండ్‌కు పంపకపోవడాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) హైకోర్టులో సవాల్ చేసింది. సీఆర్పీసీ సెక్షన్ 41-ఎ నోటీసు ఇవ్వలేదని వాళ్లకు రిమాండ్‌కు పంపకపోవడాన్ని తప్పుపట్టింది. బ్యాంకుల నుంచి రూ.1,911 కోట్లను రుణంగా తీసుకున్న కేసులో శ్రీనివాస్‌రావు, ఐఎంఎస్ స్కాంలో రూ.211 కోట్ల స్కాంలో శ్రీహరిబాబు పది రోజుల్లో ఎంఎస్‌జె కోర్టులో లొంగిపోవాలని హైకోర్టు ఆదేశించింది. ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టేసింది. ఈడీ అభ్యర్థనను ఆమోదించింది.