Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
లైంగిక వేధింపులు చాలా తరచుగా తెలిసిన వారి చేతుల్లోనే జరు గుతాయి. చాలామంది బాధితులు దీనిని బయటికి చెప్పుకోలేరు. ఈ సమస్యకు పరిష్కారంగా జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ హైదరా బాద్ కేంద్రం ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని జిల్లా పరి షత్ బాలికల ఉన్నతపాఠశాల విద్యార్థినులకు లైంగిక అవగాహన కార్య క్రమాన్ని నిర్వహించింది. ఇందులో విద్యార్థులకు ''గుడ్ టచ్, బ్యాడ్ టచ్'', లైంగిక వేధింపులు, ఆ తరహా వేధింపులకు వ్యతిరేకంగా తదితర అంశాలపై చర్చించారు. జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ న్యాయ బృందం ఈ లైంగిక వేధింపులకు మూల కారణాలను చర్చించి, విద్యార్థినులకు అవగాహన కల్పించింది.