Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి కేటీఆర్ ఇలాకాలో డబుల్ ఇండ్ల దందా
- లిస్టులో పేరు వచ్చినా.. కొత్తగా పేరు చేర్చాలన్నా 50వేల నుంచి లక్ష ఇవ్వాల్సిందే..!
- ఇండ్ల పంపిణీ ప్రక్రియలో వెలుగుజూస్తున్న వైనం
- వామపక్షాల ఆధ్వర్యంలో నాల్గు రోజులుగా నిరసన
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి / సిరిసిల్ల టౌన్
ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇలాకాలో డబుల్బెడ్రూమ్ ఇండ్ల దందా నడుస్తోంది.. అర్హులను గుర్తించే వ్యవహారంలో సిరిసిల్ల పట్టణ కౌన్సిలర్లు కొందరు 'వసూళ్ల'కు తెరలేపారు. మొత్తం 39వార్డుల నుంచి వచ్చిన 7363 దరఖాస్తుల్లో 2767 మంది అర్హులను అధికారులు గుర్తించగా.. ఆ ప్రక్రియంలో తలదూర్చిన ఆయా వార్డు కౌన్సిలర్లు సంబంధిత అధికారులతో కుమ్మక్కైనట్టు సమాచారం. గూడు కోసం తమ ఇంటి తలుపుతట్టిన వారి నుంచి అర్హత లేకున్నా.. అర్జీలు పెట్టుకున్న వాళ్ల నుంచి రూ.20వేల నుంచి రూ.50వేలు.. ఆపై రూ.లక్ష వరకు డిమాండ్ చేశారు. లిస్టులో పేరు రావాలన్నా.. లక్కీడ్రాలో ఇండ్లు వచ్చినా ఒప్పుకున్న డబ్బులు ముట్టజెప్పాకే తాళాలిచ్చేదంటూ ఓ వార్డు కౌన్సిలరు షరతు విధించడం కొందరు కౌన్సిలర్ల 'డబుల్' దందాను బేరీజు వేసుకోవచ్చు. మరోవైపు లిస్టులో పేరూ రాక, లక్కీడ్రాలో ఇల్లూ దక్కక కొందరు అర్హులైన పేదలు ఆందోళన బాటపట్టారు. ఇంటి స్థలం, రూ.5లక్షలు ఇంటి నిర్మాణానికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని మండెపల్లిలో 1260, శాంతినగర్లో 204, పెద్దూర్లో 516, రగుడులో 72 ఇండ్లు కలుపుకుని 2052 డబుల్బెడ్రూమ్ ఇండ్లు నిర్మాణం పూర్తి చేసుకుని ప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ ఇండ్లకు లబ్దిదారులను గుర్తించే ప్రక్రియలో భాగంగా పట్టణంలోని 39వార్డుల నుంచి వచ్చిన 7363 అర్జీల్లో.. 2767 మంది మాత్రమే అర్హులు ఉన్నట్టు అధికారులు తేల్చారు. ఇందులో ఎస్సీలకు 126, ఎస్టీలకు 14, మైనార్టీలకు 274, ఇతర తరగతులకు 2348, వికలాంగులకు 5 ఇండ్లు కేటాయించారు. ఇండ్ల పంపిణీకి సర్వం సిద్ధం చేసిన అధికారులు ఆయా వార్డుల వారీగా లక్కీ డ్రా తీసే పనిలో పడ్డారు.
పైసలిస్తేనే పత్రాల్లో పేరంటూ..
డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ ప్రక్రియ వేగవంతమైన నెలన్నరగా పేదలు తమ వార్డు కౌన్సిలర్ల ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. దీన్ని క్యాష్ చేసుకునేందుకు కొందరు తమ అనుచరులను రంగంలోకి దింపారు. అడ్వాన్సుగా రూ.20వేలు.. లిస్టులో పేరు వచ్చాక రూ.50వేలు ఆయా వార్డుల వారీగా లక్కీ డ్రా తీసే పనిలో పడ్డారు.
పైసలిస్తేనే పత్రాల్లో పేరంటూ..
డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ ప్రక్రియ వేగవంతమైన నెలన్నరగా పేదలు తమ వార్డు కౌన్సిలర్ల ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. దీన్ని క్యాష్ చేసుకునేందుకు కొందరు తమ అనుచరులను రంగంలోకి దింపారు. అడ్వాన్సుగా రూ.20వేలు.. లిస్టులో పేరు వచ్చాక రూ.50వేలు లేదా ఆపై రూ.లక్ష ఇవ్వాలంటూ బేరాలకు దిగారు. 'డ్రాలో ఇల్లు వచ్చినా.. మిగిలిన డబ్బులు ముట్టజెప్పాకే మూన్నెళ్లకు తాళాలిచ్చేది' అంటూ షరతులు విధించడం గమనార్హం. ఎలాగైనా ఇల్లు దక్కించుకోవాలన్న ఆశతో ధైర్యం చేసి కొందరు అప్పుల్జేసి మామూళ్లు ఇస్తుంటే.. ఆ సాహనం చేయలేని మరికొందరు కౌన్సిలర్ల కాళ్లావేళ్లా పడుతున్నారు. మొత్తంగా అర్హుల జాబితా పూర్తయిన నేపథ్యంలో ఒక్కో వార్డు నుంచి మామూళ్లు ముట్టజెప్పిన వాళ్లలో అనర్హులు 10 నుంచి 15మంది వరకు ఉంటారనేది అంచనా.
కేటీఆర్సారు జెప్పినా ఇల్లు రాలే..
నాల్గు రోజులుగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పలు రూపాల్లో నిరసనతో పేదలు తమ గోడు వెలిబుచ్చుతున్నారు. పట్టణంలోని కాలేజీ మైదానంలో దీక్షలో కూర్చున్న కొందరిని 'నవతెలంగాణ' పలకరించింది. 'ఈ ఇల్లుగాకుంటే ఆ ఇల్లు.. ఆ ఇల్లు గాకుంటే ఈ ఇల్లు అన్నట్టు.. కిరాయి ఇండ్లు మారుకుంట 40ఏండ్ల సంది ఇన్నే బతుకుతున్నం. మాకు ఇల్లు లేదు. గజం జాగ సుత లేదు. గిప్పుడు సర్కారు ఇల్లు ఇత్తదని ఆశతో దరఖాస్తు ఇచ్చినం. కేటీఆర్ సారు అస్తే కలిసిన. చిట్టీలేసినప్పుడు నీకొస్తదమ్మ అన్నరు. అసలు చిట్టీల లిస్టుల నా పేరే లేదు' సారూ అంటూ బాధితురాలు రాజమ్మ కన్నీటిపర్యంతమైంది. కొండ లావణ్య అనే వికలాంగురాలు మాట్లాడుతూ.. 'అన్నా 80శాతం నా కాలు పనిచేయదు. ఐదేండ్ల సంది సదరం సర్టిఫికెట్ కూడా ఉంది. డ్రా తీయకుండానే వికలాంగులకు ఇస్తానన్నరు. నాకు కాలు పన్జేయదు. కిరాయి ఇండ్లండ్ల ఉంటున్న ఇల్లు కాదుకదా.. గజం జాగకూడా లేదు' అంటూ విలపించింది. 'మా కౌన్సిలర్ ఇంటి చుట్టూ తిరిగిన. చివరికి రూ.లక్ష ఇస్తేనే లిస్టుల పేరు పెట్టిస్తా అన్నడు. పైసలియ్యకపోతే లిస్టుల పేరే రాలేదు. గూడు లేని మమ్మల్ని గిట్ల మోసం చేస్తరా?' సారూ అంటూ అలువాలపవిత్ర అనే అర్జీదారు బోరున విలపించింది. ఇలా ఆ దీక్షా శిబిరంలో ఉన్న పేదలంతా ఇండ్ల కోసం పడిగాపులు కాస్తున్నారు. ఇచ్చేందుకు ఇండ్లు లేకపోతే ఇంటి స్థలం, నిర్మాణానికి రూ.5లక్షలు అయినా ఇవ్వాలంటూ ముక్తకంఠంతో డిమాండ్ చేశారు.
అర్హులందరికీ స్థలం, రూ.5లక్షలు ఇవ్వాలి
మూషం రమేష్- సీపీఐ(ఎం) రాజన్నసిరిసిల్ల జిల్లా కార్యదర్శి
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపుల్లో పేదల నుంచి కొందరు కౌన్సిలర్లు డబ్బులు వసూలు చేశారు. డబ్బులు తీసుకుంటూ అనర్హులకూ ఇండ్లు కేటాయించారు. వారిని గుర్తించి తొలగించడమే కాకుండా.. అర్హులకు ఇవ్వడంతోపాటు మిగిలిన పేదలకు ఇంటిస్థలంతోపాటు గృహ నిర్మాణానికి రూ.5లక్షల సాయం ఇవ్వాలి.