Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎఫ్టీసీసీఐ ఆధ్వర్యంలో వరస కార్యక్రమాలు...
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇండియా, థాయిలండ్ దేశాల మధ్య సత్సంబంధాలకు 75 ఏండ్లు పూర్తయిన నేపథ్యంలో ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీ (ఎఫ్టీసీసీఐ) ఆధ్వర్యంలో వరస కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం హైదరాబాద్లో నిర్వహించిన విలేకర్ల సమవేశంలో ఎఫ్టీసీసీఐ ప్రతినిధులు, థారు కౌన్సిల్ జనరల్ నిటిరూగే ఫోన్ప్రసెర్ట్ (చెన్నై) వివరించారు. ఎఫ్టీసీసీఐ అధ్యక్షుడు కె.భాస్కరరెడ్డి మాట్లాడుతూ... థారు కాన్సులేట్తో తమ సంస్థ ఎప్పటికప్పుడు సంప్రదింపులు, సమాలోచనలు జరపటం ద్వారా తెలంగాణకు పారిశ్రామిక అవకాశాలను కల్పించేందుకు కృషి చేస్తున్నదని తెలిపారు. వాణిజ్య, వ్యాపార సంబంధాలను కూడా మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో ఎఫ్టీసీసీఐ సీనియర్ ఉపాధ్యక్షుడు అనిల్ అగర్వాల్, ఉపాధ్యక్షుడు మీలా జయదేవ్, సీఈవో ఖ్యాతి నరవణే తదితరులు పాల్గొన్నారు.