Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
యువ తెలంగాణ పార్టీ... బీజేపీలో విలీనమైంది. బుధవారం ఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తవ్డే, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు సమక్షంలో యువ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ రాణి రుద్రమదేవి... కమలం పార్టీ కండువా కప్పుకున్నారు. తద్వారా అధికారికంగా తమ పార్టీ బీజేపీలో విలీనమైందని వారు ప్రకటించారు. ఈ సందర్భంగా జిట్టా మాట్లాడుతూ... తెలంగాణ ఏర్పడి ఎనిమిదేండ్లు కావస్తున్నా, ఉద్యమ ఆకాంక్షలు ఇంకా నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే కేసులు, ఉద్యమిస్తే ఊచలు లెక్కపెట్టిస్తామనే విధంగా కేసీఆర్ పాలన సాగుతున్నదని విమర్శించారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న బీజేపీలో తమ పార్టీని విలీనం చేశామన్నారు.