Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చినజీయర్‌పై చర్యలు తీసుకోవాలి : కేవీపీఎస్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రామానుజుల స్వర్ణ విగ్రహాన్ని రాష్ట్రపతి రామ్నాధ్కొవింద్ ఆవిష్కరించిన మరుసటిరోజే మహాసంప్రోక్షణ అభిషేకం పేరుతో ఆ విగ్రహాన్ని శుద్ధి చేయడం కులవివక్షకు తార్కాణమనీ, అలా చేయడం రాష్ట్రపతిని అవమానించడమేనని కులవివక్ష వ్యతిరేక పోరాటమ సంఘం(కేవీపీఎస్) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జాన్‌వెస్లీ, టి.స్కైలాబ్‌బాబు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చినజీయర్‌స్వామి దేశప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. దళితుడైన రాష్ట్రపతి కొవింద్ ఆ విగ్రహాన్ని తాకడం తట్టుకోలేక చిన్నజీయర్ ఈ చర్యకు ఒడిగట్టాడని విమర్శించారు. సమాతమూర్తి వద్ద అంటరానితనం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నదని పేర్కొన్నారు. అయోధ్యలో రామ మందిర భూమి పూజ సందర్బంగా ప్రధాని మోదీ హౌంమంత్రి అమిత్ షాలు ఎర్రతీవాచి పై నడిస్తే రాష్ట్రపతి పక్కన మట్టిపై నడిచిన విషయాన్నీ గుర్తుచేశారు.