Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైదరాబాద్లో సిక్కు యువతిపై లైంగిక దాడులకు పాల్పడి అత్యంత దారుణంగా హత్య చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని ఆవాజ్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్ శివారులోని పారిశ్రామిక ప్రాంతంలో తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్న 14 ఏండ్ల సిక్కు యువతిని అపహరించి లైంగికదాడులకు పాల్పడి కిరాతకంగా హతమార్చారని తెలిపారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని పేర్కొన్నారు. ఏవైపు నుంచి ఏ మానవమృగాలు దాడి చేస్తాయో తెలియని స్థితిలో మహిళలున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కేసును విచారించడంలో, దుండగులను అరెస్టు చేయడంలో పోలీసు లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ బాధిత కుటుంబం ఆరోపిస్తు న్నదని తెలిపారు. ఇదే నిజమైతే ఇంతకంటే దారుణం మరొకటి ఉండబోదని పేర్కొన్నారు. పోలీసు యంత్రాంగం వెంటనే కదిలి నిందితులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.