Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సీఎం కేసీఆర్ రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ నెల 20 నుంచి వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు పలువురు ప్రజాసంఘాల నాయకులు వెల్లడించారు.బుధవారం హైద రాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థా పక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, ప్రొఫెసర్ హరగోపాల్, ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర ముఖ్య సమన్వయకర్త ఇందిరాశోభన్, టీజేఎస్ రాష్ట్ర అధ్య క్షులు ప్రొఫెసర్ కోదండరామ్, మాల మహానాడు జాతీయ అధ్యక్షులు అద్దంకి దయాకర్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.