Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా పదిమంది వికలాంగులకు ట్రై సైకిల్ మోటారు వాహనాలను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పంపిణీ చేశారు. బుధవారం హైదరాబాద్లో జరిగిన గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ వికలాంగుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని వివరించారు. ఉమ్మడి ఏపీలో నెలకు రూ.500 ఉన్న వికలాంగుల పింఛన్ సీఎం కేసీఆర్ రూ.3,016కు పెంచారని గుర్తు చేశారు. దీంతోపాటు అనేక సంక్షేమ పథకాలను అందిస్తూ వారి అభ్యున్నతికి పాటుపడుతున్నారని చెప్పారు.