Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సిద్ధిపేట కలెక్టర్గా ఉన్న సమయంలో ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి కోర్టు ధిక్కరణ వ్యాఖ్యలు చేశారో లేదో చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. కలెక్టర్గా ఉండగా చేసిన వ్యాఖ్యలను సుమోటో వ్యాజ్యంగా పరిగణించిన హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. గత ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి దాఖలు చేసిన అఫిడవిట్లో కోర్టులకు వ్యతిరేకంగా వ్యాఖ్యల ఆరోపణలపై ప్రస్తావన లేకపోవడాన్ని తప్పుపట్టింది. కోర్టులకు సంబంధించి వ్యాఖ్యలు చేశారా? లేదా? సూటిగా చెప్పాలని కోరింది. కోర్టులకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపై స్పష్టతనిస్తూ మరో అఫిడవిట్ దాఖలు చేయాలని చీఫ్ జస్టిస్ సతీష్చంద్రశర్మ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఆదేశించింది. కోర్టుకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినట్టు తేలితే జైలుకు పంపిస్తామని హెచ్చరించింది. తదుపరి విచారణను ఏప్రిల్ నాలుగో తేదీకి వాయిదా వేసింది. కాగా రాష్ట్రంలోని హైకోర్టు, జిల్లా కోర్టుల్లో విచారణ ప్రత్యక్ష ప్రసారం చేయడంపై స్పష్టత ఇవ్వాలని హైకోర్టు రిజిస్ట్రీని (పాలనా విభాగం) హైకోర్టు ఆదేశించింది. కోర్టు కేసుల విచారణ తెలుసుకునే ప్రాథమిక హక్కు రాజ్యాంగం కల్పించిందనీ, చట్టసభల్లో జరిగే వాటిని లైవ్ ఇస్తున్నట్టుగానే కోర్టుల విచారణనూ లైవ్ ఇవ్వాలని కోరుతూ శ్రీలేఖ అనే వ్యక్తి హైకోర్టుకు లేఖ రాశారు. దీనిని రిట్గా స్వీకరించిన హైకోర్టు విచారణ కొనసాగిస్తున్నది. హైకోర్టు పాలనా విభాగం కౌంటర్ దాఖలు చేయాలని చీఫ్ జస్టిస్ సతీష్చంద్రశర్మ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఆదేశించింది.