Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ముఖ్యమంత్రి కేసీఆర్కు బీజేపీ, కాంగ్రెస్ నేతలు చెంపలేసుకుని క్షమాపణ చెప్పాలని రాష్ట్ర షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలు దేహశుద్ధి చేస్తారని ఒక ప్రకటనలో హెచ్చరించారు. వారు తెలంగాణ రాష్ట్రానికి శని మాదిరిగా దాపురించారని విమర్శించారు. కేంద్ర మంత్రి జి కిషన్రెడ్డి, బీజేపీ అధ్యక్షులు బండి సంజరు, ఎమ్మెల్యే రాజాసింగ్, కాంగ్రెస్ అధ్యక్షులు ఎనుముల రేవంత్రెడ్డి నోటికొచ్చినట్టు సీఎం కేసీఆర్పై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి వ్యాఖ్యలు శాంతి, సామరస్యాలను దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొన్నారు.