Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చర్మకార కులంలో పుట్టిన వజ్రం : 645వ జయంతి వేడుకల్లో వినోద్‌కుమార్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సమాజ శ్రేయస్సు కోసం పరితపించిన గొప్ప సమతామూర్తి సంత్ రవిదాస్ అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. చర్మకార కులంలో పుట్టిన వజ్రమని అభివర్ణించారు. సంత్ రవిదాస్ 645వ జయంతి వేడుకలు బుధవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగాయి. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్ మాట్లాడుతూ 14వ శతాబ్ధంలోనే సమాజంలో సమానత్వం కోసం సందేశం వచ్చిన మహావ్యక్తి రవిదాస్ అని అన్నారు. అణగారిన వర్గాల ఆత్మస్థైర్యం అతడని చెప్పారు. ఆయన చూపించిన మార్గం అందరికీ అనుసరణీయమన్నారు. స్నేహపూర్వక భావంతో మెలగాలనీ, మనుసులందరూ ఒక్కటేనంటూ సమానత్వం సందేశమిచ్చిన మహానుభావుడని అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సైతం సంత్ రవిదాస్‌ను అనుసరించారని చెప్పారు. అసమానతల్లేని సమాజాన్ని సంత్ రవిదాస్ కోరుకున్నారని వివరించారు. అన్ని వర్గాలకూ ఆయన స్ఫూర్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, ఎస్సీ కార్పొరేషన్ చైర్మెన్ బండ శ్రీనివాస్, దైవజ్ఞ శర్మ, సంత్ రవిదాస్ జయంతి వేడుకల నిర్వహణ కమిటీ చైర్మెన్ రాజమౌళి, కన్వీనర్ చీమ శ్రీనివాస్, నాయకులు తిరుపతి, రాజలింగం, వీరస్వామి, ఎస్సీ,ఎస్టీ మేధావుల ఫోరం చైర్మెన్ ఆరేపల్లి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.