Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యకాస డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పట్ల కుల వివక్ష పాటించిన చినజీయర్ స్వామిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్టు కింద కేసు నమోదు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి.ప్రసాద్, ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకటరాములు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 13న రామానుజుల స్వర్ణ విగ్రహాన్ని రాష్ట్రపతి ఆవిష్కరించిన మరుసటి రోజే...మహా సంప్రోక్షణ అభిషేకం పేరిట ఆ విగ్రహాన్ని శుద్ధి చేశారని గుర్తు చేశారు. దళితుడైన రాష్ట్రపతి... ఆ విగ్రహాన్ని తాకటం వల్లే చినజీయర్ ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపి... చట్ట ప్రకారం ఆయనపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.