Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జనగామ డీసీపీ సీతారాం
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ పోలీసులు రూ.26.25 లక్షల విలువైన 262.5కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు డీసీపీ సీతారాం తెలిపారు. స్టేషన్‌ఘన్‌పూర్ పోలిస్స్టేషన్లో బుధవారం విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. హైదరాబాద్‌లోని సీలేరు నుంచి రెండు కార్లలో మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్నారు. నమ్మదగిన సమాచారం మేరకు.. శివారెడ్డిపల్లిలో టాస్క్‌ఫోర్స్, పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించగా గంజాయి పట్టుబడింది. యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరుకు చెందిన ముదావత్ గణేష్, కొడకండ్ల మండలం రేగులతండాకు చెందిన కేలోతు రవి కుమార్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం గ్రామానికి చెందిన పాసి అనిల్‌ను అదుపులోకి తీసుకున్నారు. నాలుగు సెల్ ఫోన్లు, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా నిషేధిత పదార్థాలను సరఫరా చేసినా, వాడినా చర్యలు తప్పవని డీసీపీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీఎస్పీ రఘునాథ్ వైభవ్ గైక్వాడ్, వర్ధన్నపేట ఏసీపీ రమేష్, సీఐ ఎడవెళ్లి శ్రీనివాస్ రెడ్డి, టాస్క్‌ఫోర్స్ అధికారులు సీఐ సంతోష్, సంతోష్, ఎస్ఐ శ్రావణ్ కుమార్, కానిస్టేబుళ్లు ఉన్నారు.