Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గుండాల
పోడు భూమి లాక్కున్నారనే ఆవేదనతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మామకన్ను గ్రామానికి చెందిన కల్తి కన్నయ్య(55)కు పన్నేండు ఎకరాలు పోడు భూమి ఉంది. గతేడాది ఫారెస్ట్ అధికారులు సగం భూమి లాక్కోవడంతో ఇప్పుడు అరెకరాలు సాగు చేసుకుంటున్నాడు. కాగా, మంగళవారం కన్నయ్య పక్క పొలంలో ఫారెస్ట్ అధికారులు కందకాలు తవ్వుతుండటంతో మళ్లీ తన పొలాన్నీ లాక్కుంటారని ఆందోళనకు గురయ్యాడు. ఉన్న పోడు భూమిని లాక్కుంటే అప్పులు ఎలా తీర్చాలన్న బెంగతో మంగళవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. మృతునికి భార్య, ముగ్గురు కుమారులు, ఒక కూతురు ఉంది. కల్తి కన్నయ్య మృతితో మామకన్ను గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని కొత్తగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కన్నయ్య భౌతికాయాన్ని పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, డీసీసీబీ డైరెక్టర్ తుళ్ళూరి బ్రహ్మయ్య సందర్శించి నివాళి అర్పించారు.