Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
- కలెక్టర్ హామీతో నిరాహార దీక్ష విరమణ
- పరిష్కరించకుంటే మళ్లీ ఉద్యమం : సీపీఐ(ఎం)
నవతెలంగాణ-ఆసిఫాబాద్
ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలం ఇటిక్యాల పహాడ్ గ్రామ పోడు రైతుల సమస్యలను పది రోజుల్లో పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ హామీ ఇచ్చారు. సమస్యను పరిష్కరించాలని సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో రెండ్రోజుల నుంచి కొనసాగిన నిరవధిక నిరాహార దీక్షలు కలెక్టర్ హామీతో బుధవారం విరమించారు. అనంతరం రైతులతో కలెక్టర్ మాట్లాడుతూ.. రైతుల సమస్య 10 రోజుల్లో పరిష్కారమయ్యేలా అటవీ, రెవెన్యూ శాఖ అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతకుముందు నిరవధిక నిరాహార దీక్షలో కూర్చున్న జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దుర్గం దినకర్ మాట్లాడుతూ.. 40 సంవత్సరాలుగా పోడు చేసుకుంటున్న రైతుల నుంచి భూములు లాక్కోవడం దారుణమన్నారు.గ్రామంలో మొత్తం250 కుటుంబా లు నివాసం ఉంటున్నాయని,30 కుటుంబాలను అటవీ అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాది పంట వేయకుండా అడ్డు పడ్డారని, దీనివల్ల ఆ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి దాపురించిందని అన్నారు. అధికారుల నిర్లక్ష్యంతో విసిగి వేసారి నిరాహార దీక్ష చేసినట్టు వివరించారు.ఫారెస్ట్, రెవెన్యూ, పోలీస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి సమస్య పరిష్కారానికి కలెక్టర్ హామీ ఇచ్చిన నేపథ్యంలో తాత్కాలికంగా దీక్ష విరమిస్తున్నామని చెప్పారు. ఒకవేళ ఇచ్చిన హామీ నెరవేర్చకుంటే మళ్లీ దీక్షలు చేస్తామని హెచ్చరించా రు. దీక్షలను సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు ముంజం శ్రీనివాస్ నిమ్మరసం ఇచ్చి విరమింపజే శారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు అల్లూరు లోకేష్, గొడిసెల కార్తీక్, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బోర్కుటే శ్యాంరావ్, జిల్లా సహాయ కార్యదర్శి దుర్గం పవన్, ఉపాధ్యక్షులు దుర్గం నిఖిల్, నాయకులు గెడం టికానంద్, జాడి తిరుపతి, ఇటిక్యాల పహాడ్ పోడు రైతులు పాల్గొన్నారు.