Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గతంలో ఇచ్చిన మాట ప్రకారం పోడు సాగుదార్లందరికీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోపు పట్టాలివ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పోడు సాగు చేసుకుంటున్న రైతులపై కొనసాగుతున్న దాడులను తక్షణమే ఆపేందుకు ఆదేశాలివ్వాలని బుధవారం ఒక ప్రకటనలో కోరారు. ఈ అంశం ఏండ్ల తరబడి రగులుతున్నదని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి ఏడేండ్లు గడుస్తున్నా పోడు సాగుదార్లకు పట్టాలివ్వలేదని విమర్శించారు. 2005 డిసెంబర్ వరకు సాగుదార్లకు పట్టాలివ్వాలంటూ అటవీ హక్కుల చట్టం-2006 వచ్చినా అమలు కావడం లేదని పేర్కొన్నారు. మంగళవారం కొత్తగూడెం జిల్లాలో అధికారుల బెదిరింపులకు తట్టుకోలేక కల్తీ కన్నయ్య అనే పోడు రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి గుండెపోటుతో మరణించారని గుర్తు చేశారు.
తమ్మారెడ్డి లక్ష్మి మరణం పట్ల సీపీఐ సంతాపం
సీపీఐ ఉమ్మడి రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన తమ్మారెడ్డి సత్యనారాయణ సతీమణి లక్ష్మి మరణం పట్ల సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు సయ్యద్ అజీజ్‌పాషా, రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, తెలంగాణ అమరవీరుల ట్రస్టు కార్యదర్శి కందిమళ్ల ప్రతాప్‌రెడ్డి, తెలుగు వర్సిటీ మాజీ వీసీ ఎస్వీ సత్యనారాయణ, ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి బివి విజయలక్ష్మి సంతాపం ప్రకటించారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.