Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
కేంద్రంలో మళ్లీ బీజేపీకి అధికారం ఇస్తే తెలంగాణను ఆంధ్రలో కలిపేస్తారని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. 'దేశం కోసం, ధర్మం కోసం' అంటూ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బీజేపీ అన్నీ అమ్మేయడమే పనిగా పెట్టుకున్నదని విమర్శించారు. మళ్లీ అవకాశమిస్తే మనల్ని కూడా అమ్మేస్తుందన్నారు. జీవితాలు మార్చాలని ఓటు వేస్తే చివరకు జీవిత బీమానూ వదలడం లేదన్నారు. తెలంగాణపై వివక్ష చూపే నరేంద్రమోడీ తెలంగాణకు ప్రధాని ఎలా అవుతారనీ, యూపీ, ఉత్తర భారతానికే ఆయన ప్రధాని అని విమర్శించారు. రాష్ట్రంలో గుణాత్మక మార్పు గురించి ప్రశ్నిస్తున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.. తెలంగాణ పల్లెల్లో పర్యటించాలని, ఇక్కడి ప్రజలతో మాట్లాడాలని హితవు పలికారు.నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం సిద్దాపూర్ గ్రామంలో రూ.120కోట్లతో ప్రతిపాదించిన రిజర్వా యర్కు మంత్రి కేటీఆర్ బుధవారం శంకుస్థాపన చేశారు. రిజర్వాయర్ పనులు, తండాలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడారు. సిద్ధాపూర్ రిజర్వాయర్ నిర్మాణంతో అత్యధికంగా పంటలు పండే ప్రాంతంగా బాన్సువాడ నిలుస్తుందన్నారు. ఈ ప్రాంత ప్రకృతికి ఫిదా అయిపోయానన్న కేటీఆర్.. టూరిజం అభివృద్ధికి చర్యలు చేపడతామని తెలిపారు. బాన్సువాడ మున్సిపాల్టీ అభివృద్ధికి రూ.25 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధికి పరితపించే పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇక్కడ ప్రాతినిథ్యం వహించడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమన్నారు.