Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్.మూర్తి డిమాండ్
- ఓయూ కమిటీ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ-ఓయూ
హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పదవి నుంచి బర్తరఫ్ చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్.ఎల్ మూర్తి డిమాండ్ చేశారు. బుధవారం ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద రాజాసింగ్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఆర్ఎల్ మూర్తి మాట్లాడుతూ.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఉత్తరప్రదేశ్ ఎన్నికలపై చేసిన ట్వీట్లో.. యోగి ఆదిత్యనాథ్‌కు వ్యతిరేకంగా ఓటు వేస్తే ప్రజలను జేసీబీతో, బుల్డోజర్తో తొక్కిస్తానంటూ బెదిరించాడని, ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. రాజాసింగ్ గతంలో కూడా అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, సమాజంలో మత ఘర్షణలను ప్రేరేపించేలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజీపీ మహేందర్‌రెడ్డి తక్షణమే స్పందించి, రాజాసింగ్ వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేయాలని కోరారు. ఎస్ఎఫ్ఐ ఓయూ కార్యదర్శి రవి నాయక్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే రాజాసింగ్‌ను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో ఎన్నికలు ఉన్నప్పుడల్లా బీజేపీ ప్రజాప్రతినిధులు హిందూ ముస్లింల మధ్య ఘర్షణలను ప్రేరేపించేలా, వారిమధ్య ఐక్యతను విచ్ఛిన్నం చేసేలా కుట్ర పన్ని వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకులు అరవింద్, ఓయూ ఉపాధ్యక్షులు రమ్య, విజరు నాయక్, కరణ్, సమరీన్, నాయకులు శ్రీను, సాయికిరణ్, ఆంజనేయులు, నరేష్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.