Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తహసీల్దార్‌కు రైతుల వినతి
నవతెలంగాణ - వీర్నపల్లి
రెండు నెలల నుంచి ధాన్యం డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమ కాలేదు.. వెంటనే డబ్బులు ఇప్పించండి అంటూ రైతులు తహసీల్దార్‌ను కోరారు. సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలోని బావుసింగ్ నాయక్ తండా, భూక్యతండా గ్రామాల రైతులు బుధవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 35మంది రైతులకు 3,782 క్వింటాళ్ల ధాన్యానికి సంబంధించిన డబ్బులు రాలేదని తెలిపారు. అధికారుల చుట్టూ రెండు నెలల నుంచి తిరుగుతున్నా సమస్య తీరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఐకేపీ సెంటర్లో అడిగితే డాటా ఎంట్రీ తప్పుడు నమోదు చేశారని, విచారణ చేస్తున్నామంటున్నారని చెప్పారు. దీంతో సాగుకు చేసిన అప్పులు తీర్చలేకపోతున్నామని వాపోయారు.