Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమనీ, సమర్ధించింది బీజేపీ అయితే అంతిమంగా లబ్దిపొందింది మాత్రం కేసీఆర్ అని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. మందికి పుట్టిన బిడ్డను తమ బిడ్డగా చెప్పుకుంటున్నదెవరో కేసీఆర్‌కే బాగా తెలుసునని పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మందస్తు ఎన్నికల కోసమే తెలంగాణలో మరోమారు సెంటిమెంట్‌ను రగిలేయాలని కేసీఆర్ కుటుంబం ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. కుటుంబాల సౌలభ్యం కోసం రాష్ట్రాలను విభజించలేదనే విషయాన్ని కేటీఆర్ గుర్తుంచుకోవాలని హితవు పలికారు. 18 నెలల తర్వాత టీఆర్ఎస్ను తెలంగాణ ప్రజలు బీజేపీలో కలుపటం ఖాయమని స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటుపై తన సవాల్‌కు అగ్గిపెట్టె మంత్రి, పీసీసీ చీఫ్‌లు తోకముడిచారని విమర్శించారు. ఉద్యమంలో బీజేపీ, కిషన్ రెడ్డి పాత్రపై తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు. ఒక్కటి అని నాలుగు అనించుకోవద్దని కేటీఆర్‌కు హితవుపలికారు.