Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పిల్‌పై విచారణ ముగింపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సికింద్రాబాద్‌లో బైసన్‌పోలో గ్రౌండ్ 33 ఎకరాలు,జింఖానా గ్రౌండ్ 22 ఎకరాల్లో సెక్రటేరియట్,అసెంబ్లీ, కళాభవన్లను నిర్మించాలనే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను సవాల్ చేసిన పిల్స్‌పై విచారణకు హైకోర్టు తెరదించింది. రక్షణ శాఖకు చెందిన భూముల్లో ఆ నిర్మాణ ప్రతిపాదనలు అమల్లో లేవని ప్రభుత్వం చెప్పింది. దీంతో రిటైర్డు డీజీపీ ఎంవీ భాస్కరరావు ఇతరులు వేసిన పిల్స్‌పై విచారణను హైకోర్టు ముగించింది. డిఫెన్స్‌కు చెందిన భూములను కేంద్రం కేటాయిస్తేనే అందులో ఏమైనా చేయాలనీ, లేదంటే వాటిలో ఏలాంటి నిర్మాణాలు చేయోద్దనీ, ఆ భూముల జోలికి వెళ్లొద్దని రాష్ట్ర ప్రభత్వానికి సూచించింది.సచివాయలం ఉన్న చోటనే మళ్లీ నిర్మాణం చేస్తున్నామనీ,డిఫెన్స్ భూముల్లో నిర్మాణాలు చేయాలన్న ప్రతిపాదన అమల్లో లేదని ప్రభుత్వం చెప్పడంతో పిల్స్‌పై హైకోర్టు విచారణను తెరదించింది.