Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో మెడిసినల్ గార్డెన్ ప్లాంటేషన్‌ను ఎమ్మెల్సీ సురభి వాణీదేవి ప్రారంభించారు. సీఎం కేసీఆర్ 68వ జన్మదినం సందర్భంగా గురువారం వర్సిటీ ప్రాంగణంలో ఆమె ఆయుర్వేద మొక్కలు నాటారు. అనంతరం వాణీదేవి మాట్లాడుతూ ప్రభుత్వరంగ సంస్థల్లో మౌలిక సదుపాయాలు చాలా అవసరమని చెప్పారు. మెడిసినల్ గార్డెన్‌ను అభివృద్ధి చేస్తున్న వర్సిటీ అధికారులను అభినందించారు. భవిష్యత్తులో వర్సిటీ చేపట్టే కార్యక్రమాలకు మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం మద్దతు ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ వీసీ కె సీతారామారావు, అకడమిక్ డైరెక్టర్ ఈ సుధారాణి, రిజిస్ట్రార్ జి లక్ష్మారెడ్డి, ఇంజినీర్ బి లక్ష్మి ప్రసాద్, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అధికారులు లక్ష్మారెడ్డి, లీలతోపాటు వర్సిటీ బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.