Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పీఆర్సీ అమలులో జాప్యానికి నిరసనగా టీఎస్‌యూటీఎఫ్ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లో తలపెట్టిన గురుకుల ఉపాధ్యాయుల ధర్నా వాయిదా పడింది. ఈ మేరకు టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. మైనార్టీ, బీసీ సంక్షేమ శాఖలు పీఆర్సీ అమలుకు సంబంధించిన జీవోలను విడుదల చేశాయని గుర్తు చేశారు. గిరిజన సంక్షేమ శాఖ జీవో సిద్ధమైందని తెలిపారు. మేడారం జాతర పనుల్లో ఆ శాఖ కార్యదర్శి బిజీగా ఉన్నందున రెండు రోజుల్లో ఆ జీవో విడుదలవుతుందంటూ అధికారులు చెప్తున్నారని వివరించారు. దీంతో ధర్నాను వాయిదా వేస్తున్నామని పేర్కొన్నారు. జూన్ నుంచి రావాల్సిన వేతన బకాయిలను ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని గురుకుల విద్యాసంస్థల అధికారులను కోరారు.