Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న రెగ్యులర్ జూనియర్ లెక్చరర్లను 317 జీవో ఆధారంగా బదిలీ చేయడంతో ఉద్యోగాలు కోల్పోయిన 32 మంది కాంట్రాక్టు అధ్యాపకులకు తిరిగి పోస్టింగ్ ఇచ్చారు. ఈ మేరకు ఇంటర్ విద్యా కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మల్టీజోన్-1 పరిధిలో 25 మంది, మల్టీజోన్-2 పరిధిలో ఏడు మంది కలిపి మొత్తం 32 మంది తిరిగి పోస్టింగ్ ఇచ్చామని తెలిపారు. వారు శుక్రవారం విధుల్లో చేరాలని ఆదేశించారు. డీఈఐఈవోలు, నోడల్ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. కాంట్రాక్టు అధ్యాపకులకు తిరిగి పోస్టింగ్ ఇవ్వడం పట్ల జలీల్‌కు టిగ్లా అధ్యక్షులు ఎం జంగయ్య, ప్రధాన కార్యదర్శి మాచర్ల రామకృష్ణగౌడ్, టీఎస్‌జీసీసీఎల్‌ఏ-475 ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, నాయకులు హరగోపాల్ ధన్యవాదాలు తెలిపారు.