Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
భారత జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ)లో ఐదు శాతం వాటాలను సమర్పించే క్రమంలో ప్రాస్పెక్ట్ను సెబీకి సమర్పించడాన్ని నిరసిసిస్తూ సికింద్రాబాద్ శాఖ ఉద్యోగులు గురువారం సాయంత్రం కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషఅ (ఎఐఐఇఏ) పిలుపులో భాగంగా దాని అనుబంధ సంఘం ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ (ఐసీఇయూ) ఆధ్వర్యంలో సిటీ బ్రాంచ్ -10 సికింద్రాబాద్ శాఖ ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు.ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ డివిజన్ ఐసీఇయూ సంయుక్త కార్యదర్శి యస్.గుణశేఖ ర్,ఐసీఇయూ సిటీ బ్రాంచ్-10, సికింద్రాబాద్ అధ్యక్షులు శ్యామల, కార్యదర్శి యస్.రవి తదితర నాయకులు పాల్గొన్నారు.