Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్‌కు జూలకంటి లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో మున్సిపాల్టీల్లో పనిచేసే వారికి జీవో నెంబర్ 60 ప్రకారం కేటగిరీల వారీగా వేతనాలను నిర్ణయించిన నేపథ్యంలో గ్రామపంచాయతీ సిబ్బందికీ వాటిని వర్తింపచేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు గురువారం ఆయన లేఖ రాశారు. మున్సిపాల్టీల్లో పనిచేస్తున్న సిబ్బందికి కేటగిరీల వారీగా రూ.15,600, రూ.19500, రూ.22,750 వేతనాలు నిర్ణయించి అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. కానీ గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న సిబ్బందికి వేతనాలను పెంచలేదని తెలిపారు. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులు, క్యాజువల్ లేబర్, డైలీవేజ్ వర్కర్లు, ఫుల్ టైం, కంటింజెంట్ వర్కర్లు, కన్సాలిడేట్ పే వర్కర్లు, పార్ట్ టైం వర్కర్లు, హోంగార్డులు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు, విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లు, ఆశా వర్కర్లు, సెర్ఫ్ ఉద్యోగులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌లకు రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెంచిందని వివరించారు. అందరికీ పెంచిన ప్రభుత్వం పంచాయతీ సిబ్బందికి మాత్రమే పెంచకపోవడంతో తీవ్ర ఆందోళనతో ఉన్నారని తెలిపారు. 60 జీవో ప్రకారం మున్సిపాల్టీల్లో నిర్ణయించిన వేతనాన్ని పంచాయతీ సిబ్బందికీ వర్తింపచేసి అమలు చేయాలని కోరారు. 51 జీవోను సవరించి మల్టీ పర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలనీ, కారోబార్, బిల్ కలెక్టర్లకు ప్రత్యేక హోదా కల్పించాలనీ, పీఎఫ్, ఈఎస్ఈఐలతోపాటు ఎస్కేడే ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేయాలని సూచించారు. వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.