Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'డబుల్' అర్హుల నిరసన
నవతెలంగాణ - సిరిసిల్ల టౌన్
సిరిసిల్లలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు అర్హత ఉండి కూడా డ్రాలో పేర్లురాని వారందరికీ ఇండ్లను అందించాలని.. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పేదలు చేస్తున్న ఆందోళన ఏడో రోజుకు చేరుకుంది. గురువారం సీఎం కేసీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పి నిరసన కొనసాగించారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వకుంటే స్థలం కేటాయించి ఇల్లు నిర్మించుకునేందుకు రూ.5లక్షలు ఇవ్వాలని ఆందోళన చేపట్టారు. ప్లకార్డుల చేతబట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) సిరిసిల్ల జిల్లా కార్యదర్శి మూషం రమేష్ మాట్లాడుతూ.. సిరిసిల్ల పట్టణంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి ప్రభుత్వం, అధికారులు పలు దఫాలుగా వచ్చిన దరఖాస్తులను సర్వే చేసి 39వార్డుల్లో సభలు పెట్టి మొత్తం 2767 మందిని అర్హులుగా ప్రకటించారన్నారు. కానీ డ్రా పద్ధతిలో 1804 మందిని మాత్రమే ఎంపిక చేశారన్నారు. అందులోనూ అనర్హులు ఉన్నారని తెలిపారు. దీంతో అర్హత ఉన్నా 963మంది ఎంపిక కాలేదని వాపోయారు. అధికారులు స్పందించి వెంటనే అనర్హులను తొలగించి అర్హులందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని, లేదా స్థలం కేటాయించి ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షల రూపాయలు అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు, కోడం రమణ, సూరం పద్మ, గన్నేరం నర్సయ్య, గోవిందు లక్ష్మణ్, స్వప్న, లావణ్య, లత, మానస, బాధితులు పాల్గొన్నారు.