Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హుజూర్నగర్ మున్సిపాలిటీ నిర్ణయం
- నియామక పత్రం అందజేసిన ఎమ్మెల్యే సైదిరెడ్డి
నవతెలంగాణ-హుజూర్నగర్టౌన్
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మున్సిపాలిటీలో స్వచ్ఛ సర్వేక్షన్ 2022 బ్రాండ్ అంబాసిడర్గా ట్రాన్స్జెండర్ (లావణ్య)ను నియమించారు. గురువారం ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఆమెకు నియామక పత్రం అందజేశారు.
హుజూర్నగర్ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపాలిటీ పరిధిలో స్వేచ్ఛ సర్వెక్షన్ 2022లో భాగంగా ట్రాన్స్ జెండర్ (లావణ్య)ను బ్రాండ్ అంబాసిడర్గా ప్రకటించి నియామకపత్రం, రూ.5వేల పారితోషికం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మున్సిపాలిటీ పరిధిలో స్వచ్ఛ సర్వెక్షన్-2022కు బ్రాండ్ అంబాసిడర్గా భాగంగా దేశంలోనే మొదటి సారిగా ట్రాన్స్జెండర్ను ప్రకటించటం సంతోషకరమన్నారు. ప్రజలంతా స్వచ్ఛత పట్ల బాధ్యతగా ఉండాలని కోరారు. లింగ అసమానతలను రూపుమాపే విధంగా స్వచ్ఛ హుజూర్నగర్ సాధనలో భాగస్వామ్యం చేయడానికి.. ట్రాన్స్జెండర్ లావణ్యను బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక చేసినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ గెల్లి అర్చన రవి, వైస్ చైర్మెన్ జక్కుల నాగేశ్వరరావు, కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.